తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మత్తుకు బానిసై చిన్నారుల బాల్యం ఛిద్రం

దేశంలో కోటీ పదమూడు లక్షల మందికి పైగా బాల కార్మికులున్నారు. వీరంతా 5 నుంచి 14ఏళ్ల మధ్య వయసున్న పిల్లలే. 15 ఏళ్ల లోపు వయసున్న అనేక మంది పిల్లలు విద్యకు నోచుకోకుండా రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొందరు మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు.

By

Published : Apr 1, 2019, 2:21 PM IST

మత్తుమందుకు బానిసై ఛిద్రమౌతున్న చిన్నారుల బాల్యం

మత్తుమందుకు బానిసై ఛిద్రమౌతున్న చిన్నారుల బాల్యం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పిల్లలు కార్మికులుగా మారి జీవనం సాగించడం సర్వ సాధారణమైంది. ఎంతో మంది బాలలు రోడ్లపై భిక్షమెత్తుకుంటున్నారు.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్​లో కోటి పదమూడు లక్షల మంది బాల కార్మికులున్నారు. హరియాణా కురుక్షేత్రలో వీధి బాలలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని తెలుసుకునేందుకు ఈటీవీ భారత్ ప్రతినిధి బృందం ప్రయత్నించింది.

కురుక్షేత్రలోని సెక్టార్-17 మార్కెట్​లో ఎక్కువ మంది బాలలు రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు. డబ్బుకోసం అవసరమైతే దొంగతనానికి వెనుకాడట్లేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా, పిల్లల్లో మార్పు కనిపించట్లేదు. యథావిధిగా రోడ్లపై అడుక్కుంటూనే ఉన్నారు.

వారిలో కొంత మందిని అనుసరించింది ఈటీవీ భారత్ బృందం. భిక్షాటన డబ్బుతో ఏం చేస్తున్నారని ప్రశ్నించిన బృందానికి విస్తు పోయే నిజాలు తెలిశాయి. వచ్చిన డబ్బుతో వారు మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. కారు పంక్చర్​ అతికించేందుకు ఉపయోగించే లోషన్​ను కొని, దాన్ని పాలిథీన్​పై అంటించి వాసనను పీల్చుతూ మత్తులోకి జారుకుంటున్నారు.

ఇలా చేస్తే ఎలాంటి సమస్య రావడంలేదా అని ప్రశ్నించగా, ఆ వాసన పీల్చాక కలిగే అనుభూతి చాలా హాయిగా ఉంటుందని బదులిచ్చాడు ఓ పిల్లాడు.

ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి వెళ్లింది ఈటీవీ భారత్ బృందం. దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.

దేశ వ్యాప్తంగా 5నుంచి 18ఏళ్ల వయసున్న 3కోట్ల 30లక్షల మంది బాల కార్మికులుగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:మోస్ట్ వాటెండ్​ టెర్రరిస్ట్ ఫయాజ్​ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details