తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలుడు సురక్షితం- 45గంటల శ్రమ ఫలితం - hisar

45 గంటల శ్రమకు ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం హరియాణా హిస్సార్​లో బోరుబావిలో పడ్డ చిన్నారిని అధికారులు బయటకు తీశారు. నదీమ్​ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆంబులెన్స్​లో చిన్నారి తరలింపు

By

Published : Mar 22, 2019, 6:02 PM IST

Updated : Mar 22, 2019, 7:43 PM IST

బాలుణ్ని సురక్షితంగా బయటి తీసిన సైన్యం
హరియాణా హిసార్ జిల్లా​లోని బాలాసమంద్​లో 45 గంటలపాటు అధికారులు పడిన శ్రమ ఫలించింది. చిన్నారి నదీమ్​ఖాన్​ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. బాలుడిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇలా సాగింది...

ఏడాదిన్నర చిన్నారి నదీమ్​ బుధవారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీ, క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్డీఆర్​ఎఫ్​, సైన్యాన్ని రంగంలోకి దింపారు.

ఎట్టకేలకు రెండు రోజులపాటు తీవ్రంగా కష్టపడి శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి సమీపానికి చేరుకోగలిగారు. యంత్రాలతో తవ్వకం ఆపేసి మనుషుల ద్వారా తవ్వకాలు జరిపారు. నైట్​ విజన్​ కెమెరాల సహాయంతో చిన్నారి కదలికలను గమనిస్తూ పనులు చేపట్టారు అధికారులు.పైపుల ద్వారా ఆక్సిజన్​ సరఫరా చేశారు. బిస్కెట్లు, జ్యూస్​ పంపించారు.

గురువారం చిన్నారిని బయటకు తీసేందుకు వల సహాయంతో యత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

బోర్​వెల్స్​పై సర్వే...

నదీమ్ ఘటనతో హిసార్​ జిల్లాలోని బోర్​వెల్స్​పై సర్వేకు ఆదేశించారు అధికారులు. త్వరలో తగిన చర్యలు చేపడతామని తెలిపారు.

2006లో కురుక్షేత్రలోని బోరుబావిలో పడిన ఓ పిల్లాడిని రక్షించేందుకు అధికారులు భారీ ఆపరేషన్​నే నిర్వహించారు. 48 గంటల అనంతరం ఆ బాలుడిని రక్షించారు.

ఇదీ చూడండి:భవనం కూలిన ఘటనలో 13కు మృతుల సంఖ్య

Last Updated : Mar 22, 2019, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details