తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో 138 బాల కార్మికులకు విముక్తి

గుజరాత్​లోని సూరత్​లో 138 మంది బాల కార్మికులను కాపాడారు రాజస్థాన్, గుజరాత్​ బాలల హక్కుల కమిషన్ అధికారులు. ఎన్జీవో సహకారంతో వీళ్లకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు.

Child labours rescued
చిన్నారుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట

By

Published : Dec 29, 2019, 11:59 PM IST

గుజరాత్​లోని వస్త్ర పరిశ్రమలు, హోటళ్లలో వెట్టిచాకిరి చేయించేందుకు రాజస్థాన్​ నుంచి తీసుకువచ్చిన 138 మంది బాలలను రక్షించారు రాజస్థాన్, గుజరాత్​ బాలల హక్కుల కమిషన్ అధికారులు. నోబెల్ గ్రహీత కైలాశ్​ సత్యార్థి నిర్వహించే సామాజిక సంస్థ 'బచ్​పన్​ బచావో ఆందోళన్' సహకారంతో సూరత్​లో సోదాలు నిర్వహించి ఈ బాలలను రక్షించారు.

సోదాల్లో పట్టుకున్న 12 మంది నిందితులను పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన 138 మంది బాలల్లో 128 మంది రాజస్థాన్​కు చెందినవారు కాగా మిగతావారు ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలవారు.

బాలలు ఈ దురవస్థ నుంచి బయటపడేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించనున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది రాజస్థాన్​లోని గిరిజన ప్రాంతాలకు చెందిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మానవుల్లో నృత్య నైపుణ్యం చింపాంజీల నుంచే.!

ABOUT THE AUTHOR

...view details