74వ పదాతిదళ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర సైనికులకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే నివాళులు అర్పించారు.
పదాతిదళ దినోత్సవం వేళ.. అమర వీరులకు రావత్ నివాళి - నేషనల్ వార్ మెమోరియల్
దిల్లీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర సైనికులకు నివాళులర్పించారు త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణే. 74వ పదాతిదళ దినోత్సవం పురస్కరించుకుని అమర వీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో కూడా నివాళులర్పించారు.

పదాతిదళ దినోత్సవం నాడు అమర వీరులకు నివాళి
అనంతరం కీలక చర్చల కోసం భారత్ వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ అధికారి మార్క్ ఎస్పర్ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు.
వార్ మెమోరియల్ వద్ద మైక్ పాంపియో
ఇదీ చూడండి:-9 గంటల విచారణలో టీ కూడా తీసుకోని మోదీ