తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాథ్రస్​ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం సిఫార్సు - యోగి ఆదిత్యనాథ్​ హాథ్రస్​

హాథ్రస్​ హత్యాచార ఘటనపై యోగి ఆదిత్యనాథ్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి సిఫార్సు చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్​ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Chief Minister Yogi Adityanath orders Central Bureau of Investigation (CBI) probe into the #Hathras case
సీబీఐ చేతికి హాథ్రస్​ హత్యాచార కేసు

By

Published : Oct 3, 2020, 9:13 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కారు సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటడం సహా.. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో యోగి సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

బాధితురాలి కుటుంబసభ్యులను.. ఉన్నతాధికారులు కలిసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తుండగా.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నుంచి ఈ తాజా నిర్ణయం వెలువడింది.

ఇదీ చూడండి:-'బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details