లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్‌ను పరామర్శించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాసవాన్ మృతికి సంతాపం తెలిపారు. ఎల్జేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు.
చిరాగ్ పాసవాన్‌ను పరామర్శించిన బిహార్ సీఎం నితీశ్ - bihar assembly elections 2020
ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్‌ను కలిశారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఇటీవల మరణించిన చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాసవాన్ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.
![చిరాగ్ పాసవాన్‌ను పరామర్శించిన బిహార్ సీఎం నితీశ్ Chief Minister Nitish Kumar met Lok Janshakti Party Chief Chirag Paswan at LJP office in Patna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9248669-thumbnail-3x2-img.jpg)
చిరాగ్ పసవాన్ను కలిసిన బిహార్ సీఎం నితీశ్
ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది ఎల్జేపీ. సీఎం నితీశ్ కుమార్‌ను మరోసారి సీఎం అభ్యర్ధిగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్జేడీ పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.