తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు - Outgoing CJI Gogoi declines requests for interviews

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు.

సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు

By

Published : Nov 15, 2019, 6:14 PM IST

Updated : Nov 15, 2019, 7:24 PM IST

సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, సుప్రీంకోర్టు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ రంజన్ గొగొయి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్​ బోబ్డే నవంబర్​ 18న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇంటర్వ్యూలకు నో..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీవిరమణ చేస్తున్న రంజన్​ గొగొయి​.. పాత్రికేయులతో ముఖాముఖి (ఇంటర్వూలు)లకు నిరాకరించారు. మీడియాకు రాసిన మూడు పేజీల లేఖలో తన హయాంలో... వదంతులు, అసత్యాలు వ్యాప్తిచెందకుండా నివారించడంలో మీడియా పరిపక్వత ప్రదర్శించిందని ప్రశంసించారు.

న్యాయవ్యవస్థలో గోప్యత, స్వేచ్ఛల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రంజన్ ​గొగొయి అభిప్రాయపడ్డారు. దీని అర్థం న్యాయమూర్తులు మౌనంగా ఉండమని కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈశాన్యం నుంచి..

ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి జస్టిస్ రంజన్ గొగొయి కావడం విశేషం. ఈ 46వ సీజేఐ.. పత్రికల ద్వారా ప్రజలను చేరుకోవాల్సిన అవసరం సుప్రీంకోర్టుకు, న్యాయమూర్తులకు లేదని అభిప్రాయపడ్డారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అలాంటి అవసరం ఏర్పడవచ్చన్నారు.

ఇదీ చూడండి: బూతు బొమ్మలు చూస్తే ఇక సీబీఐ కేసులే!

Last Updated : Nov 15, 2019, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details