భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది.
వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో.. 64 ఏళ్ల సీజేఐ జస్టిస్ బోబ్డే ఒకరు.
ఇప్పటివరకు భారత ప్రధాన న్యాయమూర్తికి జెడ్ కేటగిరీ భద్రత ఉండేది. దానిని జెడ్ ప్లస్ కేటగిరికి మార్చుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జస్టిస్ బోబ్డే సీఆర్పీఎఫ్, సీఏపీఎఫ్ బలగాలు భద్రతలో ఉండనున్నారు.