తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గణతంత్ర వేడుకలకు ఘనమైన అతిథులు వీళ్లే..

భారత్​ జరుపుకోనున్న 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్​ బోల్సొనారొ హాజరుకానున్నారు. ఇప్పటికే దిల్లీకి చేరుకున్న ఆయనకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. గణతంత్ర వేడుకలకు ఇతర దేశాధినేతలు అతిథులుగా రావటం మామూలే. గత ఐదేళ్లలో వేడుకలకు హాజరైన అతిథులెవరో చూద్దాం.

Chief guests in republic day for last 5 years
Chief guests in republic day for last 5 years

By

Published : Jan 26, 2020, 6:32 AM IST

Updated : Feb 18, 2020, 10:45 AM IST

గణతంత్ర వేడుకలకు ఘనమైన అతిథులు

71వ గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు దిల్లీలో సర్వం సిద్ధం చేస్తున్నారు.ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత జరిగే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్​ బోల్సొనారొ హాజరు కానున్నారు.ఇప్పటికే దిల్లీకి చేరుకున్న ఆయనకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, మోదీ ఘన స్వాగతం పలికారు.

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత గణతంత్ర వేడుకలకు వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. భారత గణతంత్ర వేడుకల నిర్వహణపై వారు ప్రశంసలూ కురిపించారు.

గత ఐదేళ్లలో గణతంత్ర వేడుకలకు వచ్చిన అతిథులను మరోసారి గుర్తుచేసుకుందాం.

2015:

మోదీ ప్రధానైన తర్వాత2015లో జరిగిన మొదటి గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్​ ఒబామా ముఖ్య అతిథి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ, ప్రధాని మోదీ ఒబామాకు ఘన స్వాగతం పలికారు. 66వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒబామా పర్యటన సందర్భంగా వాతావరణ మార్పులు,వాణిజ్య​ రంగంలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.

ఒబామా..

2016:

67వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్​ హోలాండే ముఖ్య అతిథి. భారత సైనిక విన్యాసాలు, కవాతుకు ముగ్ధులయ్యారాయన. హోలాండే పర్యటన సందర్భంగా అణు, అంతరిక్ష సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకొన్నాయి.

ఫ్రాంకోయిస్​ హోలాండే

2017:

2017లో జరిగిన68వ గణతంత్ర వేడుకలకు అబుదాబి రాకుమారుడు మహమ్మద్ బిన్ జాయేద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహమ్మద్ బిన్ జాయేద్

2018:

69వ గణతంత్ర వేడుకలకు ఆసియా ఖండంలోని బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్​, మలేషియా, మయన్మార్​, ఫిలిప్పీన్స్​, సింగపూర్​, థాయ్​లాండ్​, వియత్నాం మొత్తం పది దేశాల నుంచి దేశాధినేతలు హాజరయ్యారు. భారత గణతంత్ర వేడుకులు అమోఘమని ప్రశంసించారు.

ఆసియా దేశాధినేతలు..

2019:

గతేడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా5వ అధ్యక్షుడిగా ఎన్నికైన సిరిల్​ రమాఫొసా హాజరయ్యారు.

రమాఫొసా
Last Updated : Feb 18, 2020, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details