తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ కేసులో చిదంబరానికి ఊరట... కానీ...

చిదంబరం పిటిషన్లపై సుప్రీం విచారణ

By

Published : Aug 23, 2019, 12:03 PM IST

Updated : Sep 27, 2019, 11:33 PM IST

13:26 August 23

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ అరెస్టు చేయకుండాసుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

సీబీఐ, ఈడీ తనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షించాలని చిదంబరం కొద్దిరోజుల క్రితం దాఖలు చేసిన వ్యాజ్యాలు నేడు సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. సీబీఐ ఇప్పటికే చిదంబరాన్ని అరెస్టు చేసినందుకు... ఈడీకి సంబంధించిన పిటిషన్​పై మాత్రమే వాదనలు జరిగాయి. చివరకు కేంద్ర మాజీ మంత్రి అభ్యర్థన పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. 

ఈడీ కేసులో స్వల్ప ఊరట వచ్చినా చిదంబరం ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.
 

13:03 August 23

ఈడీ కేసులో బెయిల్​ నుంచి మధ్యంతర రక్షణ

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్​లో చిదంబరానికి స్వల్పఊరట లభించింది.  తదుపరి విచారణ జరగనున్న ఆగస్టు 26 వరకు ఆయనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఇస్తూ కోర్టు ఆదేశించింది. 

12:49 August 23

ఆగస్టు26కు విచారణ వాయిదా.. కస్టడీలోనే చిదంబరం

చిదంబరం పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ వాయిదావేసింది. ఆగస్టు 26న తదుపరి వాదనలు విననుంది. అప్పటివరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ సీనియర్​ నేత. 

12:33 August 23

సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు

చిదంబరం పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్​ సీనియర్​ నేత తరఫున కపిల్​ సిబల్​ వాదనలు వినిపించారు. కేంద్రాన్ని, దిల్లీ హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం తరఫున వాదించిన తుషార్​ మెహ్తా, సిబల్​ మధ్య పోటాపోటీ వాదనలు జరిగాయి.   

12:19 August 23

సీబీఐకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ 26న

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఈడీకి వ్యతిరేకంగా చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు వింటోంది అత్యున్నత న్యాయస్థానం. సీబీఐకి వ్యతిరేకంగా నమోదైన పిటిషన్​పై ఆగస్టు 26న వాదనలు విననుంది ధర్మాసనం. 

12:14 August 23

చిదంబరం పిటిషన్లపై మొదలైన వాదనలు

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో దిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్​ చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. 

11:46 August 23

చిదంబరం పిటిషన్లపై సుప్రీం విచారణ

దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ కాంగ్రెస్​ సీనియర్​ నేత పి. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ల​పై సుప్రీం కోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. చిదంబరాన్ని నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వేర్వేరు పిటిషన్లలో చిదంబరం పేర్కొన్నారు. జస్టిస్‌ భానుమతి, జస్టిస్​ ఏ ఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లను విచారించనుంది.

Last Updated : Sep 27, 2019, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details