తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిహార్ జైలుకు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం - సుప్రీంకోర్టు

సుప్రీంలో చిదంబరానికి చుక్కెదురు..

By

Published : Sep 5, 2019, 11:03 AM IST

Updated : Sep 29, 2019, 12:28 PM IST

18:14 September 05

తీహార్​ జైలుకు చిదంబరం..

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్ట్​ అయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. రెండు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన అనంతరం దర్యాప్తు అధికారులు ఇవాళ ఆయన్ను దిల్లీ రోజ్​ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.

న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ కుహర్‌ చిదంబరానికి ఈనెల 19 వరకూ 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. చిదంబరాన్ని అధికారులు తీహార్​ జైలుకు పంపనున్నారు. అవసరమైన మందులు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఆయనకు జెడ్​ కేటగిరీ రక్షణ ఉన్నందున  జైలులో ప్రత్యేక గదిలో ఉంచాలని ఈడీని కోర్టు ఆదేశించింది.

జైలులో చిదంబరానికి సరైన రక్షణ ఉంటుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా కోర్టుకు నివేదించారు. అయితే మనీలాండరింగ్​ కేసులో చిదంబరం సరండర్​ అవుతారంటూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై కోర్టు ఈడీకి నోటీసు ఇచ్చింది.

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం గత నెల 21 నుంచి 15 రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు

17:35 September 05

చిదంబరం జైలుకు...

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీ కోర్టు ఆయనకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. అధికారులు ఆయన్ను జైలుకు తరలించనున్నారు.

చిదంబరం ఇప్పటివరకు సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆయన్ను తిహార్ జైలుకు తరలిస్తారని కొద్దిరోజులుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే... జుడీషియల్ కస్టడీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు చిదంబరం తరఫు న్యాయవాదులు. నేడూ అదే అంశంపై వాదనలు జరిగాయి. జుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ అభ్యర్థించగా... కోర్టు అంగీకరించింది. ఫలితంగా ఈనెల 19వరకు జైలులోనే ఉండనున్నారు కేంద్ర మాజీ మంత్రి.

16:22 September 05

దిల్లీ ప్రత్యేక కోర్టులో సీబీఐ, చిదంబరం వాదనలు

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఆయన ముందస్తు బెయిల్​ పిటిషన్​ను సుప్రీంకోర్టు  తిరస్కరించిన కొద్ది సేపటికే దిల్లీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. 

కేసు విచారణ నిమిత్తం చిదంబరంను జుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ వాదనలు వినిపించింది. ఆయన బయట ఉంటే విచారణను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు సీబీఐ తరఫు న్యాయవాది. 

సీబీఐ వాదనతో విభేదించారు చిదంబరం తరపు న్యాయవాది కపిల్​ సిబాల్. కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని చిదంబరంపై ఆరోపణలు లేవన్నారు. ఆయన ఎన్​పోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కస్టడీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు.

చిదంబరాన్ని తిహార్ జైలుకు తరలించాల్సిన అవసరం లేదని, అవసరమైతే ఆయనే ఈడీ ఎదుట లొంగిపోతారని దిల్లీ ప్రత్యేక కోర్టుకు స్పష్టం చేశారు సిబాల్.

14:08 September 05

చిదంబరానికి ఎయిర్​సెల్​ కేసులో ఊరట

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి ఎయిర్​సెల్​-మ్యాక్సిస్ కేసులో ఊరట లభించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దిల్లీలోని ప్రత్యేక కోర్టు వారు ఇద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం లక్ష రూపాయలు పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. 

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరం ఇప్పటికే అరెస్టయ్యారు. 
 

11:38 September 05

పిటిషన్​ను ఉపసంహరించుకున్న చిదంబరం

సీబీఐ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు చిదంబరం. కస్టడీ ముగిసినందున పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.

11:26 September 05

ముందస్తు బెయిల్ పిటిషన్​ తిరస్కరణ

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను ఎన్​పోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేస్తూ దిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పుతో ఏకీభవించిన జస్టిస్ భానుమతి, జస్టిస్ ఏఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం..ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఈ దశలో బెయిల్‌ మంజూరు చేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయపడింది.  

10:52 September 05

  • కేంద్ర మాజీమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
  • ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
  • ఈడీ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న పిటిషన్‌ తిరస్కరణ
  • ఈడీ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు
  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ
  • ఆగస్టు 20న చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు
  • దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
Last Updated : Sep 29, 2019, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details