తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రత్యేక గది మినహా సాధారణ ఖైదీల్లానే చిదంబరం - చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి తిహార్​ కారాగారంలో సాధారణ ఖైదీలకు అందించే సౌకర్యాలే ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక గది, వెస్టర్న్​ టాయిలెట్స్​ మినహా ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేవు. ప్రస్తుతం తిహార్​ జైలు 17 వేల మంది ఖైదీలతో కిటకిటలాడుతోంది. ఇందులో 14 వేల మంది విచారణ ఖైదీలే కావడం గమనార్హం.

ప్రత్యేక గది మినహా సాధారణ ఖైదీల్లానే చిదంబరం

By

Published : Sep 6, 2019, 11:35 AM IST

Updated : Sep 29, 2019, 3:18 PM IST

ప్రత్యేక గది మినహా సాధారణ ఖైదీల్లానే చిదంబరం

జ్యుడీషియల్​ కస్టడీ నిమిత్తం కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని తిహార్​ కారాగారానికి తరలించారు అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక గది, వెస్టర్న్​ టాయిలెట్స్​ మినహా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేవని జైలు అధికారులు తెలిపారు. ఇతర ఖైదీల తరహాలోనే ప్రత్యేక సమయాల్లో గ్రంథాలయం, టీవీని వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

గురువారం రాత్రి జైలు మెనూ ప్రకారం రొట్టె, పప్పు, కూరగాయలు, అన్నంతో చిదంబరం భోజనం చేశారని చెప్పారు జైలు అధికారులు. శుక్రవారం ఉదయం అల్పాహారం సేవించారని తెలిపారు.

కుమారుడు ఉన్న గదిలోనే...

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో భాగంగా గత ఏడాది 12 రోజుల పాటు కార్తీ చిదంబరం ఉన్న జైల్​ నంబర్​-7లోనే మాజీ మంత్రిని ఉంచారు. సాధారణంగా ఈ జైలు గదిని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కేసులకు సంబంధించిన నిందితులకు కేటాయిస్తుంటారు.

ఖైదీలతో కిటకిట...

తిహార్​ కేంద్ర కారాగారం ఖైదీలతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతం 17,400 మంది నేరస్థులు ఉన్నారు. ఇందులో 14వేల మంది విచారణ ఎదుర్కొంటున్నవారే ఉండటం గమనార్హం.

గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం దోషుల సంఖ్య 2.23 శాతం పెరిగింది.

ప్రముఖులు..

గతంలో తిహార్​ జైలులో పలువురు ప్రముఖులను ఉంచి విచారణ చేపట్టారు. ఆ జాబితాలో కాంగ్రెస్​ దివంగత నేత సంజయ్​ గాంధీ, జేఎన్​యూఎస్​యూ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​, పారిశ్రామికవేత్త సుబ్రతరాయ్​, గ్యాంగ్​స్టర్స్​​ చోటా రాజన్​, చార్లెస్​ సోభ్రాజ్​, సామాజిక కార్యకర్త అన్నా హజారే, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఉన్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో నేరస్థులు కూడా ఇదే జైలులో ఉన్నారు.

ఇదీ చూడండి: ఐఎన్​ఎక్స్​ కేసు: తిహార్​ జైలుకు చిదంబరం

Last Updated : Sep 29, 2019, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details