తూర్పు లద్దాక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన గందరగోళానికి, కలవరానికి గురిచేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. గల్వాన్ లోయ అంతా తమదేనన్న చైనా వ్యాఖ్యలపై కేంద్రం సమాధానమేమిటని ప్రశ్నించారు.
అఖిలపక్ష సమావేశం సందర్భంగా 'లద్దాక్ వద్ద ఇతరులెవరూ భారత్లోకి ప్రవేశించలేదు' అన్న మోదీ వ్యాఖ్యలు అంతకుముందు సైన్యాధిపతి, రక్షణ, విదేశాంగ మంత్రులు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు చిదంబరం. ఒకవేళ ఎవరూ భారత భూభాగంలోకి ప్రవేశించకుంటే ఈ నెల 5,6 తేదిల్లో ఘర్షణ ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.