తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరానికి ఊరట- ఈడీ కేసులో బెయిల్ - undefined

chidam
చిదంబరానికి ఊరట- ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్

By

Published : Dec 4, 2019, 10:46 AM IST

Updated : Dec 4, 2019, 11:42 AM IST

11:37 December 04

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్​ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది.

షరతులతో...

రూ. 2 లక్షల సొంతపూచీకత్తు, అదే మొత్తంతో మరో ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని చిదంబరాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. సాక్షులతో ఎలాంటి సంప్రదింపులు జరపకూడదని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడరాదని ఆజ్ఞాపించింది. 

మొదలైందిలా

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఐఎన్​ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల అనుమతులు మంజూరులో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఆగస్టు 21న సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. అదే వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగిందన్న అభియోగాలపై అక్టోబర్​ 16న ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది.

మొత్తంగా 105 రోజుల పాటు చిదంబరం తిహార్​ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఐఎన్​ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ సీబీఐ కేసులో చిదంబారానికి ఇప్పటికే బెయిల్ లభించింది. 

కాంగ్రెస్ హర్షం

చిదంబరానికి బెయిల్ మంజూరుపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరున సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించింది. ఎంతో ముందుగానే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉండిందని సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు.  

10:56 December 04

'సత్యమేవ జయతే'

చిదంబరానికి బెయిల్ మంజూరుపై కాంగ్రెస్​ హర్షం వ్యక్తంచేసింది. ఎట్టకేలకు సత్యం గెలిచిందని వ్యాఖ్యానించింది.

10:52 December 04

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్​ఎక్స్ మీడియా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. బెయిల్ మంజూరు చేస్తూ దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది సుప్రీం. పాస్​పోర్టును డిపాజిట్ చేయాలని సూచించింది. ఐఎన్​ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ సీబీఐ కేసులో చిదంబారానికి ఇప్పటికే బెయిల్ లభించింది. 106 రోజులపాటు తిహార్​ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు చిదంబరం.

10:44 December 04

  • ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్‌ మంజూరు
  • ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించని సుప్రీంకోర్టు 
  • ఐఎన్‌ఎక్స్‌ మనీలాండరింగ్‌లో సీబీఐ కేసులో ఇప్పటికే బెయిల్‌  మంజూరు
  • దేశం విడచి వెళ్లరాదని ఆదేశం, పాస్​పోర్ట్ డిపాజిట్ చేయాలని సూచన
  • 106 రోజుల పాటు తిహార్​ జైల్లో ఉన్న చిదంబరం
Last Updated : Dec 4, 2019, 11:42 AM IST

For All Latest Updates

TAGGED:

chidam

ABOUT THE AUTHOR

...view details