ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. బెయిల్ నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు నవంబర్ 15న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారుచిదంబరం. ఈ వ్యాజ్యంపై నవంబర్ 28న వాదోపవాదనలు విన్న జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది.
ఈడీ వాదనలు
కస్టడీలో ఉన్నప్పటికీ.. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో వాదించింది. అధికారంలో ఉన్న వారు ఇలాంటి నేరాలకు పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందని ఈడీ తరపు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.