హత్యాయత్నం కేసులో ముంబయి గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్తో పాటు మరో ఐదుగురికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ హోటల్ యజమాని వేసిన ఈ కేసులో ముంబయి ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది.
2012 అక్టోబర్లో స్నేహితుడిని కలవడానికి వెళుతున్న హోటల్ యజమాని బీఆర్ శెట్టిని అంధేరీలో కాల్చారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ నేరాల నియంత్రణ చట్టం(ఎంకోకా) ప్రకారం తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు దోషులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల జరిమానా విధించింది.