ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళం(సీఏఎఫ్)కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో బాంబు దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాను ఒకరు గాయపడ్డారు.
మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి - chhattisgarh naxal area
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. బస్తర్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సీఏఎఫ్ సిబ్బందిపై బాంబులతో దాడి చేశారు నక్సలైట్లు. మార్దూమ్ ప్రాంతంలో మరో బాంబు ఘటన చోటుచేసుకుంది. ఫలితంగా నక్సలైట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.
మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి
బస్తర్ జిల్లాలోని మర్దూమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల వద్ద సీఏఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో సీఏఎఫ్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు మృతిచెందినట్లు ఐజీ తెలిపారు. మర్దూమ్ ఏరియాలో జరిగిన మరో ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. అతడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో పడవ బోల్తా-ప్రయాణికులు సురక్షితం