ప్లాస్టిక్ పర్యావరణలో కలిస్తే ప్రమాదం. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు కనుగొన్నాడు ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌కు చెందిన ఆదీశ్ ఠాకూర్. తన ఆలోచనకు అంకుర సంస్థ రూపమిచ్చి ఆదాయం ఆర్జిస్తున్నాడు.
ప్లాస్టిక్ సీసాలతో టీ-షర్ట్ తయారు చేసే కంపెనీని ప్రారంభించాడు ఠాకూర్. 8-10 సీసాలతో ఒక టీ-షర్ట్ తయారు చేస్తారు. టీ-షర్ట్ భుజాలపై ఇవి ప్లాస్టిక్ సీసాలతో తయారైనవి అని ముద్రించి ఉంటుంది.
ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు ఠాకూర్. మొదట రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పాడు. అనంతరం ప్రపంచస్థాయి ప్రమాణాల గురించి తెలుసుకుని టీ-షర్టుల తయారీ ప్రారంభించానని వివరించాడు.