ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష నగదు రివార్డు ఉన్న నలుగురు నక్సల్స్ ఉన్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. పోలీసులు ఏర్పాటు చేసిన పునరావాస చర్యలు వారిని ప్రభావితం చేసినట్లు ఆయన వెల్లడించారు.
కౌకొండ పోలీస్ స్టేషన్లో సీనియర్ అధికారుల ఎదుట నలుగురు మహిళా మావోయిస్టులతో సహా 25 మంది లొంగిపోయారు. ప్రకాశ్ కర్తామీ (పండు), హద్మీ అనే మరో మావోయిస్టు జంట దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ఎదుట సరెండర్ అయ్యారు.
ప్రస్తుతం లొంగిపోయిన నక్సల్స్ చాలా ఆపరేషన్లలో పాల్గొన్నట్లు అధికారి తెలిపారు. 2016 మార్చిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయన మెయిల్వాడా మందుపాతర దాడితో వీరికి సంబంధం ఉందని వివరించారు.
విసిగిపోయామంటూ..