తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జుట్టుకు ఎరుపు రంగు వేసుకుంటే కరోనా రాదా?​

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తున్నారు అందరూ. కానీ, ఛత్తీస్​గఢ్​లోని ఓ ఊరి ప్రజలు మాత్రం వింత పద్ధతిని ఎంచుకున్నారు. తల వెంట్రుకలకు ఎరుపు రంగు పూసుకుని కరోనాను అడ్డుకుంటున్నామని చెబుతున్నారు.

Chhattisgargh villagers dye hair red to duck coronavirus
ఎరుపు రంగు హెయిర్​ డైతో కరోనాకు చెక్!​

By

Published : Nov 22, 2020, 6:23 PM IST

Updated : Nov 22, 2020, 9:05 PM IST

ఎరుపు రంగు హెయిర్​ డైతో కరోనాకు చెక్!​

కరోనా అన్ని ఊర్లను చుట్టేసింది. కానీ, ఛత్తీస్​గఢ్​లోని ఆ గ్రామంలో మాత్రం దాని ప్రభావం ఇంతవరకు కనిపించలేదు. దానికి కారణమేంటని అక్కడి వాళ్లను అడిగితే.. తాము తలకు ఎరుపు రంగు పూసుకోవడమేనని అంటున్నారు.

ఛత్తీస్​గఢ్​ దుర్గ్​ జిల్లాలోని మారుమూల గ్రామం సీర్నాభాథా. గౌరియా గోండ్​ తెగకు చెందిన 300 మందికిపైగా అక్కడ నివసిస్తున్నారు. ఈ తెగలోని సగానికిపైగా జనం తమ తల వెంట్రుకలకు ఎరుపు రంగును అద్దుకున్నారు. చిన్నా, పెద్దా, ఆడా, మగా అని తేడాలేమీ లేకుండా అందరూ ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇలా చేయడం వల్లే తాము కరోనా బారిన పడకుండా ఉంటున్నామని చెబుతున్నారు.

వెంట్రుకలకు ఎరుపు రంగు పూసుకున్న సీర్నాబాథా గ్రామస్థులు

"తలకు ఎరుపురంగు పూసుకుంటే కరోనా మమ్మల్ని ఏం చెయ్యదని మాకు కలలో దైవం చెప్పింది. ఆ వెంటనే మేమంతా ఇలా ఎరుపు రంగు వేసుకున్నాం. కాబట్టే మా ఊరిలో కరోనా లేదు. అప్పటి నుంచి వైద్యుల అవసరం మాకు లేకుండా పోయింది. మేము ఇలా చేస్తున్నాం కాబట్టే మా ఊరి నుంచి కరోనా పారిపోయింది."

-- భూల్​బాయ్​, గ్రామస్థురాలు

"మా గ్రామంలో కరోనా లేనే లేదు. మేము ఐదారు నెలలుగా తల వెంట్రుకలకు ఎరుపు రంగు వేసుకుంటున్నాం. మాకు కలలో దేవుడు కనిపించి చెప్పాడు కాబట్టే మా దగ్గర కరోనా లేదు."

--దుర్గ, గ్రామస్థురాలు

సాంకేతికత ఎంత పెరుగుతున్నా.. ఇలా మూఢ నమ్మకాలను పాటించేవారు ఇంకా ఉన్నారంటే వింతగా అనిపించకపోదు. అయితే.. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఎరుపు రంగు హెయిర్​ డైతో సీర్నాబాథా గ్రామస్థులు

"ఇలా తలకు ఎరుపు రంగును ఎందుకు వేసుకుంటున్నారని మేం వాళ్లను అడిగాం. రామ్​శీలా అనే మహిళకు కలలోకి దేవుడు వచ్చి చెప్పాడు కాబట్టే మేము ఇలా చేస్తున్నామని తెలిపారు. అప్పటి నుంచి మా ఊరిలో ఎవ్వరికీ కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ కాలేదు. మార్చి నుంచి చాలా మందికి కరోనా పరీక్షలు నిర్వహించినప్పటికీ.. ఏ ఒక్కరికీ కొవిడ్​ సోకినట్టు తేలలేదు."

--సీతారామ్​ వర్మ, సీర్నాభాథా గ్రామ సర్పంచ్​.

గమనిక: మూఢనమ్మకాలను ఈటీవీ భారత్​ ప్రచారం చేయదు. కరోనాపై ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కును ధరించండి. తరుచూ చేతులను శుభ్రం చేసుకోండి. భౌతిక దూరం పాటించండి. వైరస్​ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి.

ఇదీ చూడండి:భలే ఐడియా​: పాత సీసాలతో టాయిలెట్లు

Last Updated : Nov 22, 2020, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details