తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర భారతంలో వైభవంగా 'ఛఠ్​ పూజ' - ఛఠ్​ పూజ వార్తలు

సూర్యభగవానుడిని కొలుచుకునే ప్రత్యేక 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు బిహార్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రేదేశ్​​, సహా పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు నహయ్​-ఖాయ్​తో ప్రారంభమై నవంబర్​ 21న తెల్లవారు జామున ఉదయించే సూర్యుడికి పూజలు చేయటంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఛఠ్​ పూజ విశేషాలు తెలుసుకుందాం.

Chhath Puja
ఉత్తర భారతంలో వైభవంగా 'ఛాట్'​ పూజ

By

Published : Nov 18, 2020, 10:46 AM IST

బిహార్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా కార్తీక మాసం శుక్ల పక్షంలోని శష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ ఛఠ్​ పూజలు నిర్వహిస్తారు. దీపావళి తర్వాత జరిగే అతిపెద్ద హిందూ పండుగ కూడా ఇదే. దీపావళి మాదిరిగానే దీపాలు పెట్టి దైవాన్ని పూజిస్తారు. ఈ ఛఠ్​ పూజను.. సూర్య సస్థిల్​ పూజ, దలా ఛఠ్​​ అని కూడా పిలుస్తారు.

పూజారి లేని అరుదైన హిందూ పండుగ..

ఈ ఏడాది ఛఠ్​ పూజ నవంబర్​ 18 (బుధవారం)తో ప్రారంభమై నవంబర్​ 21 (ఆదివారం)తో ముగుస్తుంది. నవంబర్​ 20న సాయంత్రం సూర్యుడికి తొలి పూజ నిర్వహిస్తారు. నవంబర్​ 21న ఉదయం.. ఉదయించే సూర్యుడికి పూజలు చేసి..ఛఠ్​ పూజకు ముగింపు పలుకుతారు. పూజారి పాల్గొనని అత్యంత అరుదైన హిందూ పండుగగా ప్రాచుర్యం పొందింది.

ఉత్తర భారతంలో వైభవంగా 'ఛాట్'​ పూజ

36 గంటల పాటు ఉపవాసం..

ఛఠ్​ పూజ ప్రారంభం మొదటి రోజును నహయ్​-ఖాయ్​గా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా 36 గంటల పాటు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారు అక్కడి ప్రజలు. సూర్య భగవానుడిని కొలుచుకునే ఏకైక పూజగా అక్కడివారు విశ్వసిస్తారు.

నదీ ఘాట్​ వద్ద వివిధ పండ్లతో పూజిస్తోన్న మహిళ

ఛఠ్​​ మాతాను పూజించేందుకు ఠెకువా, పువా వంటి ప్రసాదాలను ఎంతో పవిత్రంగా తయారు చేసి నివేదిస్తారు. బిహార్​లో దివాళీతో పాటే ఈ ఉత్సవాల ప్రసాదాలను తయారు చేయటం ప్రారంభిస్తారు. ఛఠ్​​ మహాపర్వకు వివిధ రకాల పండ్లను వినియోగిస్తారు. నదీ ఘాట్ల వద్ద పండ్లతో అలంకరించి ఛఠ్​ మాతను పూజిస్తారు. అనంతరం ఆ పండ్లను పంచిపెడతారు. ఈ పూజలోని ప్రసాదాల్లో చెరుకు ప్రధానంగా కనిపిస్తుంది. మహాపర్వ సందర్భంగా చెరుకు గడెలతో ఇళ్లులా నిర్మించి అందులో ఏనుగు ప్రతిమను ఉంచి పూజలు చేస్తారు.

చెరుకు గడెల మధ్య ఏనుగు ప్రతిమ

ఇదీ చూడండి: ఆ ఊరి నిండా అల్లుళ్లే.. కారణమిదే.?

ABOUT THE AUTHOR

...view details