తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో యోగి కేబినెట్​లో మరో మంత్రి మృతి - YOgi cabinet

కరోనా కారణంగా ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కేబినెట్​లో మరో మంత్రి ప్రాణాలు కోల్పోయారు. భాజపా నేత, సైనిక్​ వెల్ఫేర్​ శాఖ మంత్రి ఛేతన్​ చౌహాన్​ మృతితో ఇప్పటి వరకు ఇద్దరు మంత్రులు కరోనాతో మరణించినట్లయింది. ఇప్పటికే.. ఆగస్టు 2న సాంకేతిక శాఖ మంత్రి కమల్​ రాణి వరుణ్​ కరోనాతో మృతి చెందారు.

Chetan Chauhan second UP minister to die from coronavirus
కరోనాతో 'యోగి' కేబినెట్​లో మరో మంత్రి మృతి

By

Published : Aug 16, 2020, 11:05 PM IST

కరోనా మహమ్మారి సామాన్య ప్రజలనే కాదు.. రాజకీయ నాయకులు, మంత్రులనూ వదలట్లేదు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్​లో మరో మంత్రి ప్రాణాలు కోల్పోయారు. భాజపా నేత, కేబినెట్​ మంత్రి ఛేతన్​ చౌహాన్​ మృతితో కరోనాతో మృతి చెందిన మంత్రుల సంఖ్య రెండుకు చేరింది.

భారత మాజీ క్రికెటర్​, నౌగవాన్​సదత్​ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఛేతన్​ చౌహాన్​.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ మంత్రివర్గంలో సైనిక్​ వెల్ఫేర్​, హోంగార్డ్స్​, పీఆర్​డీ, పౌర భద్రత శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు సార్లు(1991,1998)లో అమ్రోహా లోక్​సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఛేతన్​ చౌహాన్​కు భార్య, కుమారుడు వినాయక్​ ఉన్నారు.

చౌహాన్​కు జులైలో కరోనా పాజిటివ్​గా తేలింది. ఆసుపత్రిలో చేరిన క్రమంలో కిడ్నీలు, రక్తపోటు సమస్య ఏర్పడింది. దాంతో ఆయన్ని వెంటిలేటర్​పై ఉంచారు. తొలుత లఖ్​నవూలోని సంజయ్​ గాంధీ వైద్య కళాశాలలో చేరిన చౌహాన్​ను.. అనంతరం హరియాణాలోని గురుగావూన్​లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

సాంకేతిక విద్యాశాఖ మంత్రి..

ఆగస్టు 2న ఉత్తర్​ప్రదేశ్​ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్​ రాణి వరుణ్​ (62) కరోనాతో లఖ్​నవూలోని ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఇదీ చూడండి: భాజపాలోకి షహీన్​బాగ్ నిరసనకారుడు అలీ

ABOUT THE AUTHOR

...view details