కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది తిరువనంతపురంలోని కార్మెల్ బాలికల ఉన్నత పాఠశాల. వరద బాధితులకు ఎవరికి తోచిన రీతిలో వారు సాయం అందిస్తూనే ఉన్నా.. వీరు ప్రత్యేకంగా నిలిచారు. చదరంగం పోటీలు పెట్టి విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు.
చదరంగం ఆటతో వరద బాధితులకు సాయం
సహజ సౌందర్యంతో అలరారుతూ ఆహ్లాదకరంగా ఉండే కేరళ రాష్ట్రం వరదలతో అతలాకుతలమైంది. ఇటీవలి వర్షాలు, వరదలతో.. ప్రకృతి రమణీయతను కోల్పోయింది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు తిరువనంతపురంలోని ఓ పాఠశాల విద్యార్థులు ముందుకొచ్చారు. విభిన్న కార్యక్రమాల ద్వారా.. నిధులు సేకరించారు.
చదరంగం ఆటతో వరద బాధితులకు సాయం
అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి, కార్మెల్ పాఠశాల విద్యార్థిని అనుపమ్ శ్రీకుమార్ ఒకేసారి 30 మంది విద్యార్థులతో చెస్ ఆడింది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు చదరంగంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించిందీ పాఠశాల. వచ్చిన రిజిస్ట్రేషన్ ఫీజులను వరద బాధితులకు సాయంగా అందించనున్నారు. మంత్రి జయరాజన్ ఈ పోటీల్ని ప్రారంభించారు.
కేరళలో ఇటీవల కురిసిన వర్షాల ధాటికి దాదాపు 120 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
Last Updated : Sep 27, 2019, 11:23 PM IST