తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నైలో నీళ్లు కావాలంటే టోకెన్​ తీసుకోవాల్సిందే!

చెన్నైలోని రోయపెట్టా ప్రాంతంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న వారికి టోకెన్ల వారీగా నీటి సరఫరా చేస్తున్నారు అధికారులు. నీటి సంక్షోభాన్ని నియంత్రించడంలో విఫలమైనందున పురపాలక మంత్రి రాజీనామాకు డీఎంకే నేతలు డిమాండ్​ చేశారు.

చెన్నైలో నీళ్లు కావాలంటే టోకెన్​ తీసుకోవాల్సిందే!

By

Published : Jun 19, 2019, 8:10 PM IST

చెన్నైలో రోజురోజుకు నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. రోయపెట్టా ప్రాంతంలో టోకెన్లు కేటాయించి నీటి సరఫరా చేస్తున్నారు అధికారులు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు ప్రతి ఇంటికీ టోకెన్లను అందజేశారు.

మంత్రి రాజీనామాకు డీఎంకే డిమాండ్​

ప్రస్తుత నీటి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వంపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. నీటి ఎద్దడిని నియంత్రించడంలో విఫలమైనందున పురపాలక మంత్రి ఎస్​పీ వేలుమణి రాజీనామాకై డిమాండ్​ చేశారు. 400 మందికి పైగా డీఎంకే కార్యకర్తలు కార్పొరేషన్​ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు ప్రయత్నించారు.

సింగనల్లూరు ఎమ్మెల్యే ఎన్​ కార్తీక్​ అధ్వర్యంలో వేలమణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 100 మంది మహిళలు ఒట్టి కుండలను పట్టుకుని తాగునీరు సరఫరా చేయాలంటూ మొరపెట్టుకున్నారు. అలాగే తాగునీరు 15 నుంచి 20 రోజులకు ఒకసారి కాకుండా ప్రతిరోజు వచ్చేలా చూడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details