తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభాపట్టిక (ఎన్పీఆర్)కు వ్యతిరేకంగా నిరసనకారులు, ముఖ్యంగా ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ప్లకార్డులు, జాతీయం జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. వలజా రోడ్డు నుంచి సచివాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. మరోవైపు శాససనభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తమిళనాట భగ్గుమన్న ముస్లింలు.. సీఏఏనే కారణం - జాతీయ జనాభాపట్టిక
తమిళనాడులో పౌర నిరసనలు హోరెత్తాయి. తాజాగా సీఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు, జాతీయ జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు ఆందోళనకారులు. నిరసనల్లో ముస్లిం మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివాదాస్పద చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి.
తమిళనాట హోరెత్తిన సీఏఏ నిరసనలు
వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్రంలోని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. మధురై, తిరునల్వేలితో పాటు పలు ప్రధాన నగరాల్లో ముస్లిం సంఘాలు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి.
Last Updated : Mar 1, 2020, 8:09 PM IST