తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రోడ్లపై కనిపిస్తే రసాయనాల దాడి చేస్తారా?'

కరోనా నియంత్రణ పేరుతో రాజస్థాన్​ జైపుర్​ నగరపాలక సంస్థ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లపై కనిపించిన వారందరిపై రసాయనం స్ప్రే చేశారు.

Chemical spraying was done on people with home in jaipur
'రోడ్లపై కనిపిస్తే శానిటైజర్​తో తడిపేస్తారా?'

By

Published : Apr 1, 2020, 1:14 PM IST

Updated : Apr 1, 2020, 8:29 PM IST

'రోడ్లపై కనిపిస్తే రసాయనాల దాడి చేస్తారా?'

రాజస్థాన్​ జైపుర్​లో రోడ్లపై నిల్చున్నవారిపై హానికర రసాయనాలు స్ప్రే చేశారు నగరపాలక సంస్థ సిబ్బంది.

రసాయనంతో తడిపేశారు...

ప్రపంచ మహమ్మారి కరోనాను నాశనం చేయడంలో శానిటైజర్ కీలకపాత్ర పోషిస్తోంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వైరస్​ను చంపేందుకు చైనా, ఇటలీ వంటి ఎన్నో దేశాలు నగరాలన్నింటినీ హైడ్రోక్లోరైడ్​ రసాయనం​తో కడిగేస్తున్నాయి. అదే పద్ధతిని భారత్​లోనూ అమలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

జైపుర్ జవహర్​నగర్ బస్తీ​​లోనూ ఈ శానిటైజేషన్​ కార్యక్రమం చేపట్టారు అధికారులు. అయితే రోడ్లు, భవనాలపై మాత్రమే పిచికారీ చేస్తే వైరస్​ను అంతమొందించలేం అనుకున్నారో ఏమో... ఇళ్ల బయట నిల్చున్న జనాలపైనా రసాయనం స్ప్రే చేశారు మున్సిపాలిటీ సిబ్బంది. ఇదేంటని అడిగితే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హైడ్రోక్లోరైడ్​లో క్రిమికీటకాలను నాశనం చేసే గుణాలుంటాయి. కానీ, అది శరీరంపై పడితే చర్మంపై మంట, కంటి సమస్యలకు దారితీస్తుంది. అలాంటి హానికర రసాయనాన్ని కాస్తయినా కనికరం లేకుండా కనిపించిన ప్రతివారిపై చల్లేస్తున్నారు కొందరు సిబ్బంది. ఈ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానికులు.

యూపీలోనూ ఇదే తరహాలో వలసదారులపై అక్కడి సిబ్బంది రసాయనం స్ప్రే చేయగా... తీవ్ర వివాదాస్పదమైంది.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వెతలు: 8 నెలల గర్భిణి- 200కి.మీ నడక

Last Updated : Apr 1, 2020, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details