తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీజేఐపై అంతర్గత విచారణకు ప్రత్యేక ప్యానెల్​ - CJI

భారత ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు ప్రత్యేక ప్యానెల్​ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బాబ్డే నేతృత్వంలో ప్యానెల్​ను ఏర్పాటుచేసింది.

సీజేఐపై విచారణకు ప్రత్యేక ధర్మాసనం

By

Published : Apr 24, 2019, 6:17 AM IST

Updated : Apr 24, 2019, 7:43 AM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలపై అంతర్గత విచారణకు ప్రత్యేక ప్యానెల్​ను ఏర్పాటు చేసింది న్యాయస్థానం. ఈ బృందానికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బాబ్డే నేతృత్వం వహించనున్నారు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి కావటం వల్ల బాబ్డేను ఈ విచారణకు ఎంపిక చేశారు.

"జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్​ ఇందిరా బెనర్జీలను నా బృందంలోకి తీసుకున్నాను. ఇది అంతర్గత విచారణ ప్యానెల్​ మాత్రమే. ఎలాంటి వాది, ప్రతివాదులకు అవకాశం లేదు. సాధారణ న్యాయ విచారణ కాదు. ఎలాంటి గడువు ఉండదు. చర్చల ఫలితాలను బట్టి తీసుకోవాల్సిన చర్యలపై భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. అదీ రహస్యంగానే చేస్తాం. " -జస్టిస్​ ఎస్​ఏ బాబ్డే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

భారత ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేశారు. ఆ ప్రమాణపత్రం నకళ్లను 22 మంది సుప్రీం న్యాయమూర్తులకు పంపారు.

'ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలి'

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరపాలని సామాజిక కార్యకర్తలు ప్రశాంత్​ భూషణ్, అరుణ రాయ్​ కోరారు.

ప్రశాంత్​ భూషణ్, అరుణ రాయ్​తో పాటు మేధా పాట్కర్, రచయత అరుందతీ రాయ్, జర్నలిస్ట్ పి. సాయినాథ్, స్వరాజ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ సహా 33 మంది ఉమ్మడి ప్రకటన చేశారు.

Last Updated : Apr 24, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details