బెంగళూరు నేలమంగళకు చెందిన హాస్టల్ యజమాని జీజీ యుహాన్.. తన వద్ద వంట చేసే సాజీతో అమానవీయంగా ప్రవర్తించాడు. చేసిన పనికి జీతం అడిగినందుకు సిగరెట్‌తో కాల్చి వాతలు పెట్టాడు. మూత్రం తాగేలా చేసి వికృతంగా ప్రవర్తించాడు.
ఇదీ జరిగింది..
జీజీ యుహాన్కు బెంగళూరులోని తోటగుడ్డహల్లిలో హోటల్‌తో పాటు హాస్టల్ ఉంది. ఇందులో వంట చేయడానికి రెండేళ్ల క్రితం సాజీని నియమించుకున్నాడు. రూ.3 వేల జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదట్లో ఇద్దరికీ మంచి సంబంధాలు ఉండేవి. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా ఇరువురి మధ్య విబేధాలు తెలత్తాయి. లాక్డౌన్లో హాస్టల్ నడవనందున ఆ మూడు నెలలకు జీతం ఇవ్వనని యుహాన్ అన్నాడు. లాక్డౌన్ మినహా మిగిలిన 9 నెలల జీతం ఇవ్వాలని జీజీ పట్టుబట్టాడు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది.