ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మళ్లీ తుపాకుల మోత వినిపించింది. సుక్మా అడవుల్లో జిల్లా రిజర్వ్ గార్డులు, మావోయిస్టుల మధ్య శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ కాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతి చెందారు.
మావోల కాల్పుల్లో ఏడుగురు జవాన్ల మృతి - ఛత్తీస్‌గఢ్ నక్సల్స్
ఛత్తీస్‌గఢ్ సుక్మా అడవుల్లో జిల్లా రిజర్వు గార్డులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్ కాల్పుల్లో ఏడుగులు గార్డులు మరణించారు. మరో 17మంది ఆచూకీ గల్లంతయింది.
![మావోల కాల్పుల్లో ఏడుగురు జవాన్ల మృతి encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6497817-thumbnail-3x2-mao.jpg)
ఎదురుకాల్పులు
14 మంది పోలీసులకు గాయాలయ్యాయి. మరో 17 మంది ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.