తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు జవాన్ల మృతి - ఎదురుకాల్పులు

ఛత్తీస్​గడ్​ కాంకేర్ జిల్లాలో  బీఎస్​ఎఫ్ జవాన్లు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

ఎన్​కౌంటర్​:నలుగురు జవాన్లు, మరో ఇద్దరు హతం

By

Published : Apr 4, 2019, 3:10 PM IST

Updated : Apr 4, 2019, 5:29 PM IST

ఛత్తీస్​గఢ్ జిల్లాలో నక్సల్స్ మళ్లీ దొంగదెబ్బ తీశారు. కాంకేర్​ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్​ఎఫ్ జవాన్లుపై కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు బీఎస్​ఎఫ్​ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన నలుగురిలో ఒకరు బీఎస్​ఎఫ్ ఎస్సై.మరో ముగ్గురు కానిస్టేబుళ్లు. మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని మహ్లాలోని బీఎస్ఎఫ్ క్యాంపునకు తరలించారు.

ఎన్​కౌంటర్​:నలుగురు జవాన్లు, మరో ఇద్దరు హతం

మహ్లాకు సమీపంలోని అటవీప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి బీఎస్​ఎఫ్ అధికారులు కూంబింగ్ చేస్తున్నారు. అడవిలో నక్కిన నక్సల్స్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ నిమిత్తం జవాన్లూ తిరిగి కాల్పులు జరిపారు.

Last Updated : Apr 4, 2019, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details