కొన్ని ఫొటోలు చూస్తే నోట మాట రాదు. చిత్రంలోని హృదయ విదారక దృశ్యాలే ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అలాంటి సంఘటనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. అమ్మానాన్న ఎక్కడా అంటూ ఏడ్చిన పిల్లల రోదన కఠిన హృదయుల్ని సైతం కన్నీళ్లు పెట్టుకునేలా చేశాయి. బలౌదా బజార్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
బలౌదా బజార్‌కు చెందిన యోగేంద్ర సోని జువెల్లరీ షాప్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం వ్యాపారానికి సెలవు కారణంగా కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ టాక్సీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యోగేంద్ర.. ఆయన సతీమణి గీతా సోని అక్కడికక్కడే మృతి చెందారు. యోగేంద్ర కుమార్తెలిద్దరూ గాయపడ్డారు.
చూస్తే కన్నీరాగదు
ఏడుస్తూ అమ్మానాన్న ఎక్కడా అని పిల్లలు అడగడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. కుమార్తెల రోదనతో వారి హృదయాలు ద్రవించాయి. చాలా సమయం అనంతరం వారికి తల్లిదండ్రుల మృతి గురించి తెలిసింది.