తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్

పాక్..​ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంపై ఆందోళన వ్యక్తం చేసింది భారత్​. పండుగ వాతావరణం వేళ ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడాన్ని ఖండించింది. ఈ మేరకు ఆ దేశ హై కమిషనర్​ను పిలిపించి నిరసన తెలిపింది విదేశాంగ శాఖ.

Charged Affaires of the High Commission of Pakistan was summoned by the Indian Ministry of External Affairs
పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్

By

Published : Nov 14, 2020, 8:20 PM IST

సరిహద్దులో పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్​​పై ఆగ్రహించింది భారత్​. ఈ మేరకు ఆ దేశ హై కమిషనర్​ను పిలిపించి నిరసన తెలిపింది.

భారత్‌లో పండుగ వాతావరణం ఉన్నసమయంలో ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. హింసను వ్యాప్తి చేసేలా పాకిస్థాన్ వైపు నుంచి జరుగుతున్న చర్యలను, సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటుకు ఆ దేశం నుంచి అందుతున్న మద్దతును తప్పుబట్టింది.

జమ్ము కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందగా... మరో ఆరుగురు పౌరులు చనిపోయారు.

ఇదీ చదవండి:దీటుగా బదులిస్తాం.. పాక్‌, చైనాకు మోదీ హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details