తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జూన్​ 30 వరకు చార్​ధామ్​ యాత్రకు అనుమతి లేదు' - ఛార్​దామ్​ యాత్ర నిరాకరణ

ఉత్తరాఖండ్​ చార్​ధామ్​ యాత్రకు జూన్​ 30 వరకు అనుమతి లేదని దేవస్థాన బోర్డు కమిటీ ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సీఈఓ రవినాథ్​ తెలిపారు.

Chardham yatra not to start till Jun 30
జూన్​ 30 వరకు చార్​ధామ్​ యాత్రకు అనుమతి లేదు

By

Published : Jun 9, 2020, 5:02 PM IST

ఉత్తరాఖండ్​లోని చార్​ధామ్​ ఆలయాల్లోకి జూన్ 30 వరకు భక్తులను అనుమతి లేదని దేవస్థాన బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా బాధితులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

'చార్​ధామ్'​గా పిలుచుకునే ఉత్తరాఖండ్​లోని నాలుగు పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​ దేవాలయల్లోకి జూన్​ 30 వరకు భక్తులను అనుమతించవద్దని ఆలయ పూజారులు, హుక్​దారులు కలిసి అధికారులను కోరారు. ఈ నాలుగు దేవాలయాల్లో యథావిధిగా పూజలు జరుగుతాయని.. కానీ భక్తులను మాత్రం అనుమతించబోమని ఆలయ బోర్డు సీఈఓ రవినాథ్​ రామన్​ తెలిపారు. జూన్​ 30 తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సిలబస్, బోధన​ సమయం కుదింపు దిశగా కేంద్రం

ABOUT THE AUTHOR

...view details