ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం రేపు(గురువారం) తెరుచుకోనుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా భక్తులు దర్శించుకొనే మూడో ఆలయం ఇదే. అలాగే బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈ నెల 10న తెరుచుకుంటాయి. బద్రీనాథ్ సందర్శనతో చార్ ధామ్ యాత్రను ముగించుకుంటారు భక్తులు.
చార్ ధామ్ ప్రారంభం
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్‌లో మంగళవారం ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఉదయం 11.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణ మధ్య గంగోత్రి, మధ్యాహ్నం 1.15 గంటలకు యమునోత్రి ఆలయాలను తెరిచారు పండితులు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు.