భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ల్యాండర్ విక్రమ్ తో సంబంధాలను కోల్పోయింది 2.1 కిలోమీటర్ల దూరంలో కాదని.. కేవలం 400 మీటర్ల దూరంలో కమ్యూనికేషన్ కోల్పోయిందని సమాచారం. విక్రమ్‌తో సంబంధాలను కోల్పోవటం, చంద్రుని ఉపరితలానికి 2.1 కి.మీ. దూరంలో ఉండగా జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. ఇస్రో ప్రకటనను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
ల్యాండర్‌తో సంబంధాలు తెగింది 400 మీ. దూరంలోనే! - lander vikram
చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలను కోల్పోయింది చంద్రుని ఉపరితలం నుంచి 400 మీటర్ల దూరంలో మాత్రమేనని సమాచారం. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు 2.1 కి.మీ. కాదని ఇస్రో వర్గాలు తెలిపాయి.
ల్యాండర్‌తో సంబంధాలు తెగింది 400మీటర్ల దూరంలో!
చంద్రయాన్ 2 ఆర్బిటర్ క్షేమంగానే ఉందన్నాయి ఇస్రో వర్గాలు. తన ప్రయాణంలో ఆర్బిటర్ చేసిన ఇంధన పొదుపు చర్యల వల్ల మిషన్ లైఫ్ మొదట అనుకున్నట్టు ఒక సంవత్సరం కాకుండా ఏడు సంవత్సరాలకు పొడిగించగలగటం శుభపరిణామంగా పేర్కొన్నాయి. గడువు తగ్గిపోతున్న నేపథ్యంలోవిక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తీవ్రంగా కృషిచేస్తున్నట్లు వెల్లడించాయి.
ఇదీ చూడండి: చంద్రయాన్-2 ఆర్బిటర్ అత్యుత్తమం: ఇస్రో మాజీ ఛైర్మన్
Last Updated : Sep 30, 2019, 10:16 AM IST