భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్-2 విజయం వెనుక శంకరాచార్యుల హస్తం ఉంది. చంద్రయాన్-2కు వేదపండితునికి సంబంధమేంటని అనిపించినా అదే నిజం.
ఇస్రో విజయ గాథ వెనక గోబర్థన్ పీత్, స్వామి నిశ్చలానంద సరస్వతి, జగద్గురూ శంకరాచార్యుల వారి ప్రోత్సాహం ఉంది. చంద్రయాన్-2ను దిగ్విజయంగా నింగిలోకి పంపేందుకు పూరీ జ్ఞానుల సలహా మేరకు వేద గణిత శాస్త్రంలోని సూత్రాలను ఉపయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు.
చంద్రయాన్-2 ప్రయోగానికి కొన్ని రోజుల ముందు శాస్త్రవేత్తలు శంకరాచార్యులతో చర్చించారు. ప్రయోగానికి పంచాంగం ప్రకారం ముహూర్తమూ ఖరారు చేశారు. అయితే, ఇదివరకే శ్రీహరి కోటలోని ఇస్రో ప్రయోగశాలను శంకరాచార్యులు పరిశీలించి.. గ్రహలకు సంబంధించిన వేదాలను శాస్త్రవేత్తలతో చర్చించినట్లు తెలుస్తోంది.