తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో కీలక ఘట్టానికి సిద్ధమైన 'చంద్రయాన్​-2' ​ - arbitor

నేడు చంద్రయాన్​-2 ఆర్బిటర్​ నుంచి ల్యాండర్​ విక్రమ్​ను వేరు చేసే ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య ల్యాండర్​ విడిపోనుంది.

మరో కీలక ఘట్టానికి సిద్ధమైన 'చంద్రయాన్​-2' ​

By

Published : Sep 2, 2019, 9:09 AM IST

Updated : Sep 29, 2019, 3:40 AM IST

మరో కీలక ఘట్టానికి సిద్ధమైన 'చంద్రయాన్​-2' ​

చంద్రయాన్​-2 ప్రయోగంలో మరో ఘట్టానికి ఇస్రో సన్నద్ధమయింది. చంద్రయాన్​-2 ఆర్బిటర్​ నుంచి ల్యాండర్​ విక్రమ్​ను వేరు చేసే ప్రయోగం నేడు మధ్యాహ్నం చేపట్టనుంది. ప్రస్తుతం చంద్రయాన్​-2 నౌక చంద్రుడి చుట్టూ 119x127 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తోందని, వ్యవస్థ పనితీరు సాధారణంగానే ఉందనే ప్రకటించింది.

చంద్రయాన్​-2 ఆర్బిటర్​ నుంచి ల్యాండర్​ విక్రమ్​ను వేరుచేసే ప్రక్రియను మధ్యాహ్నం 12.45 నుంచి 13.45 సమయంలో చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేందుకు వీలుగా ల్యాండర్​ విక్రమ్​కు రెండు డీ ఆర్బిట్​ విన్యాసాలు చేపడతారు.

సెప్టెంబరు 3న మొదటి విన్యాసం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య, 4న రెండో డీ ఆర్బిట్​ విన్యాసం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో ప్రణాళిక వేసింది. సెప్టెంబరు 7న తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో విక్రమ్​.. చంద్రుడి ఉపరితలాన్ని తాకనున్నట్లు ఇస్రో అధికారిక వెబ్​సైట్​లో తెలిపింది.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2కు ఆఖరి కక్ష్య కుదింపు

Last Updated : Sep 29, 2019, 3:40 AM IST

ABOUT THE AUTHOR

...view details