ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 ఐదో ఆఖరి కక్ష్య కుదింపు ప్రక్రియ ఆదివారం విజయవంతంగా ముగిసింది. తర్వాతి విన్యాసమైన చంద్రయాన్-2 కక్ష్య నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరుచేసే ప్రయోగానికి సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్2న ముందస్తు ప్రణాళిక ప్రకారం సాయంత్రం 6.21 గంటల సమయంలో ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా 52సెకన్ల పాటు ఈ విన్యాసాన్ని చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చంద్రయాన్-2 నౌక చంద్రుడి చుట్టూ 119x127 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తోందని, వ్యవస్థ పనితీరు సాధారణంగానే ఉందనే ప్రకటించింది.
చంద్రయాన్-2కు ఆఖరి కక్ష్య కుదింపు - ల్యాండర్ విక్రమ్
చంద్రయాన్-2 కక్ష్య నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరు చేసే ప్రయోగానికి సన్నద్ధమవుతోంది ఇస్రో. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 ఐదో ఆఖరి కక్ష్య కుదింపు ప్రక్రియను ఆదివారం విజయవంతంగా చేపట్టింది.
చంద్రయాన్-2 కక్ష్య నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరు చేయడం ఈ ప్రయోగంలో తర్వాతి విన్యాసమని, దీనిని సెప్టెంబరు 2న మధ్యాహ్నం 12.45 నుంచి 13.45 సమయంలో చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేందుకు వీలుగా ల్యాండర్ విక్రమ్‌కు రెండు డీ ఆర్బిట్ విన్యాసాలు చేపడతారు. సెప్టెంబరు 3న మొదటి విన్యాసం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య, 4న రెండో డీ ఆర్బిట్ విన్యాసం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో ప్రణాళిక వేసింది. సెప్టెంబరు 7న తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో విక్రమ్.. చంద్రుడి ఉపరితలాన్ని తాకనున్నట్లు ఇస్రో అధికారిక వెబ్సైట్లో తెలిపింది.
ఇదీ చూడండి : బిర్యానీ తినడంలో బాహుబలి- 9 నిమిషాల్లోనే కిలో ఫసక్!