భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మంగళవారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన వాహకనౌక నుంచి.. 'విక్రమ్' ల్యాండర్ వేరు కానుంది. సెప్టెంబర్ 7న చంద్రుడిపై ల్యాండర్ దిగనుందని ఇస్రో అధినేత శివన్ వెల్లడించారు. తెల్లవారుజామున 1.55 గంటలకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.
" విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగే ప్రక్రియ సెప్టెంబర్ 7, తెల్లవారుజామున 1.40కు మొదలై 1.55కు పూర్తవుతుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా ఇది ఎంతో కీలక ప్రక్రియ. ఈ ఘట్టాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమిస్తున్నారు. "
- కే శివన్, ఇస్రో ఛైర్మన్
చంద్రుని కక్ష్యను ఈ బుధవారమే రెండోసారి తగ్గించుకున్న చంద్రయాన్-2.. కీలక ఘట్టానికి ముందే మరో మూడుసార్లు కక్ష్యను తగ్గించుకోనుంది. అనంతరం చంద్రుని ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలోని తుది ఆర్బిట్‌కు చేరుకుంటుంది. విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 2నే ఆర్బిటర్ నుంచి వేరై చంద్రుని చుట్టూ 100 కి.మీ X 30 కి.మీ ఆర్బిట్‌లోకి ప్రవేశించనుంది. అనంతరం సెప్టెంబర్ 7న జాబిల్లి ఉపరితలంపై దిగనుందని ఇస్రో ప్రకటించింది.
ప్రధానికి ఆహ్వానం..