తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్-2 రెండో దశ భూకక్ష్య పెంచిన ఇస్రో - second face

చంద్రయాన్- వాహక నౌక భూకక్ష్యను ఇస్రో రెండోసారి పెంచింది. ఈ తెల్లవారుజాము 1.08నిమిషాలకు రెండోసారి కక్ష్య పెంచారు. ఆగస్టు 14తేది వరకూ ఇలా కక్ష్యలు పెంచుతూ భూకక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్​-2ను ప్రవేశపెడతారు.

చంద్రయాన్-2 రెండో దశ భూకక్ష్య పెంచిన ఇస్రో

By

Published : Jul 26, 2019, 10:19 AM IST

చంద్రయాన్-2 వాహక నౌక భూకక్ష్యను రెండోసారి విజయవంతంగా పెంచింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. బుధవారం మధ్యాహ్నం మొదటి భూకక్ష్యను పెంచగా... ఈ తెల్లవారుజామున 1. 08 నిమిషాలకు రెండోసారి కక్ష్య పెంచారు.

రెండోసారి పెంపు ద్వారా చంద్రయాన్-2 వాహకనౌక 251x54, 829 కిలోమీటర్ల ఎత్తున భూకక్ష్యలోకి చేరింది. ఆన్‌బోర్డులో ఉన్న ఇంధనాన్ని 883 సెంకండ్లు మండించడం ద్వారా... విజయవంతంగా కక్ష్యను పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. కక్ష్య పంపు ప్రక్రియను మూడోసారి జులై29 మధ్యాహ్నం చేపడతామని అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 14 వరకు ఇలా కక్ష్యలు పెంచే ప్రక్రియలను చేపడుతూ, భూకక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్​ను ప్రవేశపెడతామని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆపరేషన్​ విజయ్​: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details