తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2తో రోదసిలో మనది ప్రత్యేక ముద్ర! - SRIHARI KOTA

భారత్​కు ఎంతో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్​-2 ప్రయోగానికి ఇస్రో సర్వసన్నద్ధమవుతోంది. ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు ముహూర్తం. శ్రీహరికోట వేదిక. ప్రయోగానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రాజెక్టు సంబంధిత వివరాల్ని వెల్లడిస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). జాబిల్లి దక్షిణ ధ్రువానికి వెళ్లనున్న తొలి రోవర్...​ చంద్రయాన్​-2. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమూ చేయని ప్రయోగాన్ని.. ఇస్రో సుసాధ్యం చేయాలనుకుంటోంది.

చంద్రయాన్​-2తో అంతరిక్షంలో మనది ప్రత్యేక ముద్ర!

By

Published : Jul 12, 2019, 5:39 PM IST

చంద్రయాన్​-2తో అంతరిక్షంలో మనది ప్రత్యేక ముద్ర!

చంద్రునిపై పరిస్థితుల అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టు చంద్రయాన్​-2. ఇటీవలే ప్రకటించిన ఈ ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. సోమవారం వేకువజామున చంద్రయాన్​-2తో జీఎస్​ఎల్​వీ మార్క్​-3 రాకెట్​ నింగికెగియనుంది.

''మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు....?
రోవర్​ ఆధారిత భారత తొలి అంతరిక్ష ప్రయోగం... 'చంద్రయాన్ 2'. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకొనే ప్రపంచంలోనే తొలి రోవర్​ ఇది''

అంటూ ఇస్రో, చంద్రయాన్​ను ట్యాగ్​ చేస్తూ వీడియో పంచుకుంది పీఐబీ.

జాబిల్లి కక్ష్యలోకి భారత్​ 2008లోనే చంద్రయాన్​-1 పేరుతో ఉపగ్రహాన్ని పంపించింది. ఇప్పుడు చేపట్టే ప్రయోగం.. చంద్రయాన్​-2 ద్వారా ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్​ను పంపనున్నారు.

ఆర్బిటర్​ పూర్తిగా చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతుంది. జులై 15న మొదలవనుందీ మహోత్తర ప్రయాణం. సెప్టెంబర్​ 6 లేదా 7 తేదీల్లోగా ల్యాండర్​ జాబిల్లి ఉపరితలంపై దిగుతుంది. అనంతరం.. అందులోంచి రోవర్​ బయటికొచ్చి చంద్రుడిపై తిరగడం మొదలెడుతుంది.

చంద్రయాన్​-2 ప్రయోగ వేదికైన శ్రీహరికోట సతీశ్​ ధావన్​ అంతరిక్ష కేంద్రం వద్ద సందడి నెలకొంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా చంద్రయాన్​-2 యంత్ర పరికరాలు తట్టుకునే విధంగా పలు క్లిష్ట ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం స్వయంగా అక్కడి పరిస్థితులను భూమ్మీదే కృత్రిమంగా సృష్టించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తద్వారా అంతరిక్ష రంగంలో భారత్​ చేపట్టబోయే ప్రయోగం సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా చూడాలనుకుంటోంది ఇస్రో.

ABOUT THE AUTHOR

...view details