తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2: రెండో సారి కక్ష్య తగ్గింపు విజయవంతం

చంద్రుడిపై అడుగుపెట్టే లక్ష్యంతో భారత్​ ప్రయోగించిన చంద్రయాన్​-2 ప్రతి దశనూ విజయవంతంగా దాటుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆర్బిటర్​ నుంచి విడిపోయిన ల్యాండర్​ విక్రమ్... జాబిల్లి చుట్టూ తన కక్ష్యను విజయవంతంగా రెండో సారి తగ్గించుకుంది.

రెండో సారి కక్ష్య తగ్గింపు విజయవంతం

By

Published : Sep 4, 2019, 8:26 AM IST

Updated : Sep 29, 2019, 9:26 AM IST

జాబిల్లి దక్షిణ ధ్రువం రహస్యాలను వెలికి తీసేందుకు చంద్రయాన్-2 దూసుకెళ్తోంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన 'విక్రమ్‌' ల్యాండర్‌ తొలి కక్ష్యను మంగళవారం తగ్గించిన ఇస్రో ఇవాళ మరోసారి తగ్గించింది. ఈ ప్రక్రియను ఉదయం 3 గంటల 42 నిమిషాలకు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది.

ఆన్​-బోర్డ్​ ప్రొపల్షన్​ వ్యవస్థను ఉపయోగించి ఈ ప్రక్రియను 9 సెకన్లలో పూర్తి చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.

ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున ఒంటి గంటా 55 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్‌ను.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించనున్నట్లు పేర్కొంది. అనంతరం 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాల రోబోటిక్ వాహనం 'ప్రగ్యాన్' రోవర్ బయటకు వస్తుంది. ఇది నెలవంకపై ఉండే నీరు, ఇతర లవణాల జాడపై పరిశోధనలు చేస్తుంది.

Last Updated : Sep 29, 2019, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details