తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం' - ఆర్బిటార్

చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​తో కోల్పోయిన సంబంధాల పునరుద్ధరణ అత్యంత కష్టమని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విక్రమ్, ప్రజ్ఞాన్​పై ఆశలు వదులుకున్నట్లేనని వివరించారు. అయితే... ఆర్బిటర్ భద్రంగా ఉన్నట్లు ప్రకటించింది ఇస్రో. జాబిల్లి కక్ష్యలోనే తిరుగుతున్నట్లు వెల్లడించింది.

చంద్రయాన్​-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'

By

Published : Sep 7, 2019, 10:29 AM IST

Updated : Sep 29, 2019, 6:11 PM IST

చంద్రయాన్​-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'

చంద్రయాన్-2 కాసేపట్లో జాబిల్లిపై సురక్షితంగా దిగుతుందన్న దశలో ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది 'విక్రమ్ ల్యాండర్'. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా అంతరిక్ష కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రయాన్​-2 భవితవ్యంపై ఇస్రో సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ల్యాండర్ పునరుద్ధరణ అంత తేలిక కాదని చెప్పారు. విక్రమ్, ప్రజ్ఞాన్​ను మనం కోల్పోయినట్లేనని పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.

"ల్యాండర్​తో ఎలాంటి కమ్యూనికేషన్​ లేదు. మనం ల్యాండర్​ను కోల్పోయినట్లే. తిరిగి దక్కుతుందన్న ఆశ లేదు. ల్యాండర్​, ఇస్రో మధ్య సంబంధాల పునరుద్ధరణ చాలా చాలా కష్టం."

-ఇస్రో సీనియర్ అధికారి

ఆర్బిటర్ భద్రమే... ఇస్రో

ప్రయోగంలో భాగమైన ఆర్బిటర్ భద్రంగానే ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది.

"ఆర్బిటర్​ క్షేమంగా ఉంది. సరిగానే పనిచేస్తుంది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతోంది."

-ఇస్రో ప్రకటన

2,379 కిలోల బరువుండే ఆర్బిటర్ జీవిత కాలం ఒక సంవత్సరం. చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ సెన్సింగ్ ద్వారా పరిశోధనలు జరుపుతుంది. 8 శాస్త్రీయ పేలోడ్​లను కలిగి ఉండే ఆర్బిటర్.... చంద్రుడి ఉపరితలం మ్యాపింగ్, బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.

ప్రయోగంలో పూర్తి డేటాను విశ్లేషించి, ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది ఇస్రో.

ఇదీ చూడండి: నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం: మోదీ

ఇస్రో ఛైర్మన్ కన్నీటిపర్యంతం- మోదీ ఓదార్పు

Last Updated : Sep 29, 2019, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details