భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగ విశేషాలను విడుదల చేసింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే ఇలా చేసినట్టు ప్రకటించింది. చంద్రుడిపై ఎనిమిది పరిశోధనలు చేపట్టగా.. ఎన్నో ఖగోళశాస్త్ర ప్రశ్నలకు సమాధానం లభించిందని ఇస్రో పేర్కొంది.
2019 జులై 22-న ఆంధ్రప్రదేశ్‌లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించింది ఇస్రో.
త్వరలో చంద్రయాన్-3..
చంద్రుడి దక్షిణ ధ్రువ విశేషాలను కనుగొడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రయోగ చివరి నిముషంలో సాంకేతిక కారణాలతో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ గట్టిగా ఢీకొనగా సంబంధాలు తెగిపోయాయి. అయినప్పటికీ ఆర్బిటార్ సమాచారాన్ని పంపుతోంది.
మరోసారి విజయవంతంగా రోవర్, ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపే చంద్రయాన్-3 మిషన్‌ను త్వరలోనే చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ప్రకటించారు.
ఇదీ చదవండి:గగన్‌యాన్‌పై కరోనా ప్రభావం- ఏడాది వాయిదా