తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్-2: '95%​ లక్ష్యాలు సాధించిన మిషన్​' - లక్ష్యాలు

చంద్రయాన్-2 మిషన్​లో ల్యాండర్​ విక్రమ్​ చంద్రుని ఉపరితలాన్ని చేరుకోవడంలో అవాంతరాన్ని ఎదుర్కొంది. అయితే దీనిపై మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. చంద్రయాన్​-2 ఇప్పటికే 95 శాతం మిషన్ లక్ష్యాలను సాధించిందని విశ్లేషించారు.

చంద్రయాన్-2: '95%​ లక్ష్యాలు సాధించిన మిషన్​'

By

Published : Sep 7, 2019, 1:04 PM IST

Updated : Sep 29, 2019, 6:23 PM IST

చంద్రయాన్-2: '95%​ లక్ష్యాలు సాధించిన మిషన్​'

చంద్రయాన్​-2పై ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్​ నాయర్ ప్రశంసలు కురిపించారు. ఆ మిషన్ ఇప్పటికే 95 శాతం లక్ష్యాలను సాధించిందని... ల్యాండర్​తో సంబంధాలు తెగిపోవడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఆర్బిటర్​ సురక్షితం

చంద్రుని ఉపరితం చేరుకోవడంలో ల్యాండర్​ విక్రమ్​కు ఇబ్బంది ఎదురవడం నిరుత్సాహానికి గురిచేసిందని నాయర్​ పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగడమే మన ముందున్న లక్ష్యమని చెప్పారు మాధవన్.

ఇదీ చూడండి: 'ఇస్రో కోల్పోయింది విక్రమ్​నే... ప్రజల ఆశల్ని కాదు'

Last Updated : Sep 29, 2019, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details