తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2: షెడ్యూల్​ ప్రకటించనున్న ఇస్రో - లైవ్​

చంద్రయాన్​-2: లైవ్​ అప్​డేట్స్​

By

Published : Jul 15, 2019, 12:33 AM IST

Updated : Jul 15, 2019, 3:03 AM IST

02:40 July 15

చంద్రయాన్​-2 ప్రయోగం నిలిపివేత...

  • సాంకేతిక లోపం కారణంగా నిలిచిన చంద్రయాన్​-2 ప్రయోగం
  • నేడు ఇక చంద్రయాన్​-2 ప్రయోగం లేనట్లే.
  • లాంచింగ్​ రోజును ప్రకటించనున్న ఇస్రో

02:19 July 15

నిలిచిన కౌంట్‌డౌన్‌ 

  • నిలిచిన చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగం కౌంట్‌డౌన్‌
  • సాంకేతిక లోపంతోనే కౌంట్‌డౌన్‌ నిలిచినట్లు సమాచారం
  • ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకండ్లు ఉందనగా నిలిచిన కౌంట్‌డౌన్‌

02:12 July 15

మరి కాసేపట్లో...

మరి కొద్ది నిమిషాల్లో గగన వీధుల్లో భారత జెండా రెపరెపలాడనుంది. నిప్పులు కక్కుతూ... మబ్బులు చీల్చుకుంటూ చంద్రయాన్​-2 నింగికి ఎగరనుంది.

01:40 July 15

హైడ్రోజన్​ ఫిల్​...

జీఎస్​ఎల్వీ మార్క్‌-3 ఎం1 వాహకనౌకకు లిక్విడ్​ హైడ్రోజన్​ ​నింపే ప్రక్రియ పూర్తయింది.. 

01:35 July 15

మరి కాసేపట్లో..?

శ్రీహరికోటలోని సతీష్ ధవన్​ అంతరిక్ష కేంద్రం నుంచి నింగికి ఎగిరే చంద్రయాన్​-2 ను ప్రత్యక్షంగా చూడటానికి వీక్షకులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటున్నారు.

00:40 July 15

ఆక్సిజన్​ ఫిల్​...

జీఎస్​ఎల్వీ మార్క్‌-3 ఎం1 వాహకనౌకకు లిక్విడ్​ ఆక్సిజన్​ను నింపారు. లిక్విడ్​ హైడ్రోజన్​ను నింపుతున్నారు.​ 

00:23 July 15

భారత అంతరిక్ష చరిత్రలో......అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.  శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని... జీఎస్​ఎల్వీ మార్క్‌-3 ఎం1 వాహకనౌక.... తెల్లవారుజామున.. 2 గంటల 51 నిమిషాలకు  నిప్పులు కక్కుతూ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. జాబిల్లి ఉపరితలంపై విస్తృత పరిశోధనలు చేపట్టనున్న చంద్రయాన్‌-2.... చందమామ ఉపరితలాన్ని శోధించి అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించడంలో సాయపడనుంది.

Last Updated : Jul 15, 2019, 3:03 AM IST

ABOUT THE AUTHOR

...view details