చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని కీలక ఉపకరణాల్లో ఒకటైన సోలార్ ఎక్స్‌రే మానిటర్(ఎక్స్ఎస్ఎం) సౌరజ్వాలలను గుర్తించింది. అందులోని ఎక్స్‌రే ఉద్గారాల స్థాయిని కొలిచింది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో వరుసగా వీటిని గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సౌర జ్వాలలను గుర్తించిన చంద్రయాన్-2
చంద్రయాన్-2లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్బిటర్‌లోని ప్రధాన ఉపకరణాల్లో ఒకటైన సోలార్ ఎక్స్‌రే మానిటర్ (ఎక్స్ఎస్ఎం) సౌర జ్వాలల గుర్తించింది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి నుంచి 24 గంటల వ్యవధిలోనే వీటిని గుర్తించినట్లు ఇస్రో తెలిపింది.
సూర్యుడి ఉపరితలం నుంచి ఆకస్మాత్తుగా విస్ఫోట రూపంలో శక్తి వెలువడటం వల్ల ఈ జ్వాలలు ఉత్పన్నమవుతుంటాయి. వీటి నుంచి భారీగా రేడియోధార్మికత వెలువడుతుంది. అందులో ఎక్స్‌రేలూ ఉంటాయి. వీటిని తెలివిగా ఉపయోగించుకోవడం ద్వారా చంద్రుడిపై ఖనిజాల ఉనికిని ఎక్స్ఎస్ఎం గుర్తిస్తుంది. ఈ ఎక్స్‌రేలు తాకినప్పుడు జాబిల్లి పైనున్న మూలకాల నుంచి ప్రత్యేక సంకేతాలు వెలువడతాయి. వాటిని పసిగట్టి, విశ్లేషించడం ద్వారా అక్కడి ఖనిజాల విస్తృతిని గుర్తించవచ్చు.
ఇదీ చూడండి:'రామ మందిరానికి ముస్లింలు.. స్థలమివ్వాలి'