చంద్రుని ఉపరితలంపై స్పెక్ట్రోస్కోపిక్ అధ్యయనాన్ని ప్రారంభించింది చంద్రయాన్-2 ఆర్బిటర్. ఇందుకోసం ఆర్బిటర్లో అమర్చిన ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్టోమీటర్(ఐఐఆర్ఎస్) పేలోడ్ పనిచేయడం మొదలుపెట్టింది.
చంద్రునిపై పడే సూర్య కిరణాల తీవ్రత లెక్కింపునకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. జాబిలి నుంచి పరావర్తనం, ఉద్గారం చెందే సూర్యరశ్మిని ఐఐఆర్ఎస్ లెక్కగడుతుంది. వీటిని ఆధారంగా చేసుకుని చంద్రుని పరిణామ క్రమాన్ని విశ్లేషించటమే ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం.