తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హనుమంతునికి 7 అడుగుల పొడవైన రాఖీ! - Chandigarh women prepare 7-feet-long eco-friendly rakh

రాఖీ అంటే దారంతో కలిపి ఓ పది, పదిహేను అంగుళాల పొడవుంటుంది. కానీ, పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 7 అడుగుల రాఖీ తయారు చేశారు మహిళలు. ఆంజనేయుడికి కట్టే రాఖీ అంటే ఆ మాత్రం పొడవుండాల్సిందే అంటున్నారు.

chandigarh-women-prepare-7-feet-long-eco-friendly-rakhi-for-lord-hanumans-statue
ఏడు అడుగుల పొడవైన రాఖీ!

By

Published : Aug 2, 2020, 3:42 PM IST

పంజాబ్ చండీగఢ్​లో ఏకంగా ఏడు అడుగుల పొడవైన రాఖీ తయారు చేశారు మహిళలు. స్థానికంగా ఉన్న 32 అడుగుల హనుమాన్ విగ్రహం చేతికి సరిపోయే విధంగా.. ఈ రక్షాబంధన్ రూపొందించారు. శ్రీరాముడి చిత్రాన్ని మధ్యలో పెట్టి.. చుట్టూ రిబ్బన్స్, రుద్రాక్ష, కృత్రిమ పూలతో అలంకరించారు.

" గత 15 రోజులగా మేము రోజుకు రెండు నుంచి మూడు గంటల సమయం వెచ్చించి ఈ రాఖీ తయారు చేశాం. ఈ పర్యావరణహిత రాఖీకి రుద్రాక్షలు జత చేస్తున్నాం. 32 అడుగుల ఎత్తున్న విగ్రహం చేతికి దాదపు 7 అడుగుల రాఖీ సిద్ధం చేశాం."

- మీనా తివారీ, బృంద సభ్యురాలు

ఇదీ చదవండి: లైవ్ వీడియో: ఒళ్లు గగుర్పొడిచేలా రౌడీ షీటర్ హత్య!

ABOUT THE AUTHOR

...view details