ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్ దిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) కార్యాలయంలో హాజరయ్యారు. ఐసీఐసీఐ-వీడియోకాన్ అక్రమ రుణ మంజూరు కేసుపై ఆమెను ప్రశ్నిస్తున్నారు అధికారులు.
వీడియోకాన్ కేసులో ఈడీ ముందుకు కొచ్చర్ - icici
ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఐసీఐసీఐ-వీడియోకాన్ అక్రమ రుణ మంజూరు కేసుపై ఆమెను ప్రశ్నిస్తున్నారు అధికారులు.
వీడియోకాన్ కేసులో ఈడీ ముందుకు కొచ్చర్
విచారణకు హాజరుకావాలంటూ చందాకొచ్చర్ సహా ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు గతంలో సమన్లు జారీ చేసింది ఈడీ. కొచ్చర్, వీడియోకాన్ ప్రతినిధి వేణుగోపాల్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.
వీడియోకాన్‌కు రూ.1875 కోట్ల రుణం మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్‌పై ప్రధాన ఆరోపణ.